SPORTS

స‌త్తా చాటిన విద్యార్థుల‌కు కంగ్రాట్స్

Share it with your family & friends

అభినందించిన మంత్రి వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి – ఏపీ హొం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కత్తిసాము పోటీలలో ప్రతిభ చాటిన చిన్నారులను ప్రశంసించారు.

కత్తిసాము పోటీలలో రాణించి మెడల్స్ సాధించిన పొన్నూరులోని సెయింట్ థామ‌స్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను అభినంద‌ల‌తో ముంచెత్తారు.

నంద్యాల జిల్లాలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో అండర్ 19 విభాగంలో ఆ పాఠశాల విద్యార్థులు హాదసాగ్రేసి ( సిల్వర్ మెడల్), షేక్ జాస్మిన్ (సిల్వర్ మెడల్), ఎల్. వివేక్ రాజ్ గ్రూప్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్స్ సాధించడం గర్వ కారణమన్నారు.

బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో త్వరలో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న విద్యార్థినులకు హోంమంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్ర‌భుత్వ ప‌రంగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌న్నారు .