NEWSANDHRA PRADESH

త‌మ ప్ర‌భుత్వం ఎవ‌రినీ బ‌లి చేయ‌దు

Share it with your family & friends

హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి – ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఎవ‌రినీ కావాల‌ని బ‌లి చేయ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ స‌ర్కార్ అంద‌రికీ న్యాయం చేస్తుంద‌న్నారు.

గత ప్రభుత్వం అక్రమ చర్యల వల్ల బలైన అమాయకులెందరో లెక్క గట్టలేం అన్నారు. ముంబయ్ సినీ నటి కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టబోమంటూ హెచ్చ‌రించారు అనిత‌. చట్ట ప్రకారమే దర్యాప్తు..ఆధారాలతోనే ఐపీఎస్ ల సస్పెన్షన్ జ‌రిగింద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం హోం శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.

కుట్రలు పన్ని బోట్లను ప్రకాశం బ్యారేజ్‌పైకి వదిలారని ఆరోపించారు. కౌంటర్ వెయిట్ లు ధ్వంసమై ఉంటే ప్రమాదాన్ని ఊహించగలమా? అని ప్ర‌శ్నించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు పనుల పరిశీలన అనంతరం హోంమంత్రి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ముంబయ్ నటి కేసులో ప్రభుత్వం ఎవరినీ బలి చేయలేదని..బాధిత మహిళకు న్యాయం చేస్తోందని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

చట్ట ప్రకారమే దర్యాప్తు వేగంగా జరుగుతుందని, లోతైన దర్యాప్తులో తేలిన ఆధారాలు పరిశీలించాకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు.

ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలి పెట్ట బోమన్నారు. గత ప్రభుత్వం పైశాచికత్వం వల్ల బలైన అమాయకులు లెక్కలేనంత మంది ఉన్నార‌ని ఆమె తెలిపారు. విజయవాడ ప్రజలు, ఎన్డీయే ప్రభుత్వం చేసుకున్న అదృష్టం వల్లే మరింత ప్రమాదం జరగకుండా అక్కడితో ఆగిపోయిందన్నారు.