NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంతో హోం మంత్రి భేటీ

Share it with your family & friends

రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పై చ‌ర్చ

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర హొం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత మంగ‌ళ‌గిరిలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు.

అనంత‌రం హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారని చెప్పారు. 185 అగ్నిమాపక స్టేషన్లు, సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలిచ్చినట్లు వంగ‌ల‌పూడి అనిత‌ వెల్లడించారు.

100 లేదా 101 నంబర్లకు ఫోన్ లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నామ‌ని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించార‌ని పేర్కొన్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

వాయు కాలుష్యం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నార‌ని దీనిపై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన ‘దియాజలావ్’ కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నార‌ని, దీనిని కూడా రాష్ట్రంలో అమ‌లు చేస్తామ‌న్నారు.