నేరాల విషయంలో దృష్టి సారించండి
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. గురువారం సచివాలయంలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.
ఇటీవలే సంచలన ఆరోపణలు, కామెంట్స్ చేశారు అనిత వంగలపూడిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతోందని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సుతిమెత్తగా ఉంటే కుదరదని, కాస్తా గట్టిగా ఉండాలని అనిత వంగలపూడిని ఉద్దేశించి అన్నారు. అంతే కాదు తానే గనుక హోం మంత్రినైతే సీన్ వేరేలా ఉంటుందన్నారు. మరింత ముందుకు వెళ్లి యూపీలో యోగి లాగా పాలన చేయాలని అన్నారు. దీంతో కూటమిలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
దీంతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్, అనిత వంగలపూడి కలుసు కోవడం, ఆప్యాయంగా అర మరికలు లేకుండా మాట్లాడు కోవడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా తాను నటుడినే కాదు రాజకీయ నాయకుడిని అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.