Tuesday, April 22, 2025
HomeDEVOTIONALటీటీడీ ఈవోతో హోం మంత్రి చ‌ర్చ‌లు

టీటీడీ ఈవోతో హోం మంత్రి చ‌ర్చ‌లు

శ్రీ‌క‌ల్కి వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య అభివృద్దిపై

తిరుమ‌ల – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి సోమ‌వారం తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం అనిత టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశమయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కల్కి వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై హోంమంత్రి చర్చించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో భాగస్వామ్యమైన ఈ ఆలయానికి సంబంధించి స్వామి వారి గర్భగుడి, మూల విరాట్ ను పునరుద్ధరించాలని కోరారు. ప్రాచీన పుణ్యక్షేత్రమే కాకుండా దశావతారాలలో చివరిదశైన శ్రీ కల్కి వేంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చే ఆలయాలలో ఇదే ఏకైక క్షేత్రమని హోంమంత్రి ఆలయ చరిత్రను, ప్రాశస్త్యాన్ని వివరించారు.

2014 ఆగస్టు 9వ తేదీన నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెంకటేశ్వర స్వామి క్షేత్ర దర్శనానంతరం ఆలయ సమస్యలు తెలుసుకుని అభివృద్ధి చేపట్టగా మిగిలి పోయిన పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆమె కోరారు.

ముఖ మండపం, ఆస్థాన మండపం, రాజగోపురం, నడకదారి, మెట్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే గరుడాద్రి పర్వతంగా పిలిచే కొండ కింద భాగంలోని నారద మహాముని చేతుల మీదుగా ప్రతిష్టించిన వేణుగోపాల స్వామి ఆలయంలో కొత్తగా మూడు రాజగోపురాలను ఏర్పాటు చేయాలన్నారు.

భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ షెడ్డు, కళ్యాణ మండపం, రోడ్ల విస్తరణ, అన్నదాన భవనం, గోశాల నిర్వహణ, గోవుల పోషణ, పుష్కరిణిగా భావించే బంధుర సరస్సు, డార్మెటరీ, విశ్రాంతి గదులు, మంచినీటి వసతి, కేశ ఖండనశాల, పోటు నిర్మాణాలు చేపట్టి శ్రీవారి పారాయణదారులను నియమించి శ్రీకల్కి వేంకటేశుని పురాతన ఆలయానికి పున: వైభవం తీసుకు రావాలని హోంమంత్రి అనిత టీటీడీ ఈవో శ్యామలరావుని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments