NEWSANDHRA PRADESH

ప్ర‌తి మ‌హిళా శ‌క్తి స్వ‌రూప‌మే

Share it with your family & friends


నారీ శ‌క్తి విజ‌యోత్స‌వం

విజ‌య‌వాడ – ప్ర‌తి మ‌హిళా శ‌క్తి స్వ‌రూప‌మని అన్నారు ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శుక్ర‌వారంవిజ‌య‌వాడ పున్నమి ఘాట్ లో జరిగిన నారీ శక్తి విజయోత్సవం కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా వంగ‌ల‌పూడి అనిత మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రి లోకేష్ ను సమాజ శ్రేయస్సు కోసం ప్రజాక్షేత్రంలోకి పంపిన ఘ‌త‌న భువనేశ్వ‌రికి ద‌క్కుతుంద‌న్నారు.

జన సంక్షేమం కోసం ఎన్నో అవమానాలను భరించి.. బాధ్యతలతో పాటు సమాజానికి ఎంతో చేస్తున్న భువనేశ్వరి అసలైన శక్తి స్వరూపం అన్నారు.

భువనేశ్వరి ఆలోచన నుంచి పుట్టిన శక్తి విజయోత్సవం, ప్రతి ఏటా జరగాలని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలని ఆకాంక్షిస్తున్నాన‌ని కోరారు. నాతో పాటు అమ్మగా, కూతురుగా, కోడలిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా తమ శక్తిని సమాజ శ్రేయస్సు కోసం ధారపోస్తున్న ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపమే అని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.

అందుకే మహిళా తల్లులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో ఆ కనక దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.