NEWSANDHRA PRADESH

కూట‌మి పాల‌న‌లో పనుల ప్ర‌గ‌తి

Share it with your family & friends

మంత్రి వంగ‌ల‌పూడి అనిత కామెంట్

అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో పాల‌న కొత్త పుంత‌లు తొక్కుతోంద‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శుక్ర‌వారం పాయకరావుపేట నియోజకవర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులను ప‌రిశీలించారు. మ‌రికొన్నింటిని ప్రారంభించారు మంత్రి.

తాము వ‌చ్చాక‌ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయ‌ని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నర్సీపట్నం – రేవు పోలవరం రహదారికి పనులు ప్రారంభించడం జ‌రిగింద‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు . రూ.24 కోట్ల రూపాయలతో నిర్మించ బోతున్న ఈ రోడ్డుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చడం ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్రాంతి నాటికి పాట్ హోల్ ఫ్రీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.