క్షతగాత్రులకు సాయం అందించాలని ఆదేశం
అమరావతి – హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ తిరుణాలలో గొడవపై ఆరా తీశారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రెచ్చిపోయి రాళ్ల దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు . వాటర్ పాకెట్లు, బాటిళ్లు,రాళ్లు విసిరిన ఘటనలో పోలీసులకు, భక్తులకు గాయాలు కావడం పట్ల ఆవేదన చెందారు. పోలీసులపై దాడి ఘటనకు కారణమైన అందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును ఆదేశించారు మంత్రి.
జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కావడంపై ఆరా తీశారు. నందిగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించేలా చూడాలని ఆదేశించారు. అదుపు చేసి రక్షించాలనుకున్న పోలీసులని చూడకుండా దాడికి దిగితే సహించబోమని హెచ్చరించారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్బంగా మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు తాము ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని , కూటమి సర్కార్ హయాంలో చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.