NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డికి అంత సీన్ లేదు – అనిత

Share it with your family & friends

చంద్ర‌బాబుతో నీకు పోటీనా

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదిక‌గా ఆమె సీరియ‌స్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై. నీకు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు. సంప‌ద‌ను సృష్టించ‌డంలో త‌న‌కు తానే చంద్ర‌బాబు సాటి అని పేర్కొన్నారు. ఆయ‌న‌తో నువ్వు స‌రి తూగ లేవ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

నక్క తెలివి తేటలతో ఎమ్మెల్యేలను ఇటు నుంచే అటు లాగేసిన చ‌రిత్ర నీది కాదా అని ప్ర‌శ్నించారు. బూతే సిగ్గు పడేలా బూతులు తిట్టించావ్, ప్రతిపక్ష నాయకులను ఈడ్చి పడేయమని స్పీకర్ ద్వారా అధికారికంగా ఆదేశాలిప్పించావ్ , స్పీకర్ వైఫై జోన్ లోకి వెళ్లిన అందరినీ సస్పెండ్ చేయించిన చ‌రిత్ర నీది కాదా అని ప్ర‌శ్నించారు.

అయినా చంద్ర‌బాబు నాయుడు ఎక్క‌డా త‌గ్గ లేద‌న్నారు..సాకులు చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. నాలుగు పక్కలా చుట్టుముట్టి కాలకేయుల్లా మీద పడే మీ ఉన్మాద గుంపుల మద్యలోకి ఒక్కడిగా వచ్చారు, ప్రజల తరపున ఒక్కడై గొంతు విప్పారు, ప్రజా గళం బలంగా వినిపించారు. అరెస్ట్ అయినా మొక్కవోని దీక్షతో ముందడుగేశారు. అదీ నిబద్ధత, అదీ ధైర్యం, అదీ సింహం సింగల్ గా రావడం అంటే అని పేర్కొన్నారు.

ఎవరు సింహమో..ఎవరు మేకవన్నె పులో వేరే చెప్పాలా? అది నీకు తెలియ‌దా అని నిల‌దీశారు వంగ‌ల‌పూడి అనిత‌.