హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. తన ఇంటి దగ్గర చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై స్పందించారు. భద్రత లోపమనే ముందు బాధ్యతగా సహకరించడం కూడా అవసరమన్నారు. ఏ ప్రమాదం, నేరం జరిగినా పరిసర ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం, సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ విచారణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డై ఉంటే వాటిని పోలీసులకు అందజేసి సహకరించడం కనీస బాధ్యత అని దానిని విస్మరించడం బాధాకరమన్నారు.
విచిత్రం ఏమిటంటే ఎవరైనా ఏదైనా ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. తమను కాపాడాలని కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి బ్యాచ్ అలా కాదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి వంగలపూడి అనిత. విచారణ కావాలని కోరుతారు..కానీ విచారణకు మాత్రం సహకరించడం లేదన్నారు.
సీన్ ఆఫ్ అఫెన్స్ లో సీసీ కెమెరా దృశ్యాలనే పోలీసులు ముందు పరిశీలిస్తారని చెప్పారు. ఛార్జ్ షీట్ వేయాలన్నా సీసీ టీవీ కెమెరాలు, వాటి దృశ్యాలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. విచారణ కోసం సీసీ టీవీ ఫుటేజ్ ఎవరిని అడిగినా పోలీసులకు ఇవ్వడం రూల్ అని తెలుసుకోక పోవడం దారుణమన్నారు.