నిప్పులు చెరిగిన మంత్రి అనిత
విశాఖపట్నం – హోం మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే జనం ఛీ కొట్టే ప్రమాదం ఉందన్నారు. రాప్తాడులో తన పర్యటన ఓ డ్రామాని తలపించేలా ఉందన్నారు. వైకాపా హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు నడుచుకునేలా చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. 12.42 కి రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయ్యిందన్నారు. కొద్ది నిమిషాల్లో చాపర్ బయలు దేరి పోయిందన్నారు. ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్ అంటూ కొట్టి పారేశారు. ఇలా కూడా ఆలోచన చేస్తారని తాను అనుకోలేదన్నారు అనిత.
బుధవారం విశాఖపట్నంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుకొచ్చిందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చి పోలేదన్నారు. ముసుగు లేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మరిచి పోతారని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు అనిత వంగలపూడి. ఇలాంటి సంస్కృతి తమది కాదన్నారు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రిపై అనేక కేసులు ఉన్నాయన్నారు. ఇవన్నీ ప్రశ్నించడంతో తట్టుకోలేక అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఖాకీ చొక్కాలపై నోరు పారేసుకున్న జగన్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.