జగన్ అక్రమాలకు రిషికొండ నిదర్శనం
నిప్పులు చెరిగిన హోం మంత్రి అనిత
విశాఖపట్నం – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. సోమవారం అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా సత్కరించడం జరిగింది .
పెంటకోట కన్వెన్షన్ లో కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించిన అనిత జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన నిర్వాకం వల్లనే విశాఖ అభివృద్దికి నోచు కోలేదన్నారు.
రాష్ట్రంలోనే అనకాపల్లి జిల్లాను మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇంఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర సహకారంతో మరిన్ని నిధులు తీసుకు వచ్చేలా చేస్తామన్నారు. ఇదే సమయంలో జగన్ హయాంలో పూర్తిగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి లోనైందని ఆవేదన వ్యక్తం చేశారు అనిత వంగలపూడి.
అంతే కాకుండా ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. భూ ఆక్రమణలకు విశాఖను అడ్డాగా మార్చాడని మండిపడ్డారు మంత్రి. జగన్ రెడ్డి చేసిన అక్రమాలకు, దుర్మార్గాలకు రిషికొండ బిల్డింగే నిదర్శనమని ఫైర్ అయ్యారు. అనకాపల్లిని పారిశ్రమిక హబ్ గా మారుస్తామన్నారు. ఈ ప్రాంతంలో వనరులను గుర్తించి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత.