కేజ్రీవాల్ పై అన్నా హజారే కన్నెర్ర
ఢిల్లీ సీఎం స్వయం కృతాపరాధం
ముంబై – ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని విచారణ నిమిత్తం అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు.
తనతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మద్యం పాలసీలు రూపొందించే స్థాయికి దిగజారడం దారుణమన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని ఒప్పుకోనంటూ స్పష్టం చేశారు. నాయకులు దేశానికి, ప్రజలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలన్నారు. కానీ ఇలా మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం పాలు పంచుకోవడం దారుణమన్నారు.
ఇదే సమయంలో తాను ఈ విషయం తెలుసుకుని చాలా బాధకు గురైనట్లు తెలిపారు. వీరి కోసమేనా తాను ఉద్యమం చేసిందని అన్నారు. మరో వైపు లిక్కర్ దందాలో రాణిగా పేరు పొందారు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత. తనకు ఏ పాపం తెలియదని వెంటనే బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దానిని సుప్రీంకోర్టు కొట్టి వేసింది.