ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు రెడీ
ఉదయం టిఫిన్స్ ..మధ్యాహ్నం..రాత్రి మీల్స్
అమరావతి – ఎంత సంపాదించినా ఏం లాభం. ఉన్నదాంట్లో కొంతైనా ఆకలిని తీర్చాలన్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆచరణలో పెట్టారు. గతంలో సీఎంగా కొలువు తీరిన వెంటనే అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని పక్కన పెట్టింది.
నిత్యం ఎంతో మంది సామాన్యులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆకలితో అల్లాడి పోతుంటారు. వారికి తక్కువ ధరలో అందుబాటులో రుచి కరమైన, నాణ్యవంతమైన టిఫిన్లు, భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. టిఫిన్ అయినా, లేదా భోజనం అయినా కేవలం రూ. 5 రూపాయలు మాత్రమే.
తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సౌకర్యాలతో అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
ఇప్పటికే ఉన్న వాటితో పాటు కొత్తగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. తొలుత సీఎం ప్రారంభించగా మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రారంభిస్తారు.
ఇక మెనూ మాత్రం అద్భుతంగా ఉంది. దీని విషయంలో ఏపీ సర్కార్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్న క్యాంటీన్లలో ఏ రోజు ఏమేం వడ్డిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
వారానికి సంబధించి మెనూ ఇలా ఉంది. సోమవారం టిఫిన్ రూ. 5 కే అందజేస్తారు. ఇడ్లీ, చట్నీ , పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా పెడతారు. మధ్యాహ్నం లంచ్ రూ. 5 , తెల్ల అన్నం, కూర, పప్పు, సాంబార్ , పెరుగు, పచ్చడి వడ్డిస్తారు. రాత్రి కూడా అన్నం వడ్డిస్తారు.
మంగళవారం ఉదయం ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ, పొడి, సాంబార్ , మిక్చర్ ఉంటుంది. లంచ్ , డిన్నర్ కు తెల్ల అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డిస్తారు.
బుధవారం బ్రేక్ ఫాస్ట్ కు ఇడ్లీ, పొడి, సాంబార్ లేదా పొంగల్ , చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ ఉంటుంది. లంచ్ , డిన్నర్ కు తెల్ల అన్నం, కూర, పప్పు, సాంబార్ , పెరుగు పచ్చడి ఇస్తారు.
గురువారం బ్రేక్ ఫాస్ట్ కకు ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్ లేదా పూరి , కూర్మా వడ్డిస్తారు. లంచ్ , డిన్నర్ కు తెల్ల అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఇస్తారు.
శుక్రవారం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ ఇస్తారు. లంచ్ , డిన్నర్ కింద అన్నం, కూర, పప్పు , తెల్ల అన్నం, కూర , పప్పు సాంబార్ , పెరుగు, పచ్చడి వడ్డిస్తారు.
శనివారం రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబారు లేదా పొంల్ , చట్నీ, పొడి, సాంబారు, మిక్చర్ వడ్డిస్తారు. ఇక లంచ్ తో పాటు డిన్నర్ లో తెల్ల అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఇస్తారు.
ఇదిలా ఉండగా ఏయే సమయాలలో టిఫిన్స్ , లంచ్ , రాత్రి భోజనం వడ్డిస్తారనేది కూడా ఖరారు చేసింది ప్రభుత్వం. సోమవారం నుంచి శనివారం దాకా టిఫిన్స్ ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు ఇస్తారు.
మధ్యాహ్నం భోజనం 12.30 గంటల నుండి 3 గంటల వరకు వడ్డిస్తారు. రాత్రి భోజనం 7.30 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా అందజేస్తారు.