ఇప్పటికే పలు కేసులు నమోదు
అమరావతి – టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయన పై మరో కేసు నమోదైంది. బ్రహ్మలింగయ్య చెరువు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదు రావడంతో వంశీతో పాటు ఆయన అనుచరులు లక్ష్మణ రావు, రంగా, శేషు, రవి, పరంధామయ్యపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తను విజయవాడ సబ్ జైలులో ఉన్నారు.
వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులపై పలు కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ను అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తమపై రెచ్చి పోయిన వారందరినీ టార్గెట్ చేశారు. మెల మెల్లగా కేసులు నమోదు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. కోలుకోలేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరో వైపు ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయనను నరసారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఈనెల 13 వరకు రిమాండ్ విధించింది.