Sunday, April 6, 2025
HomeNEWSవల్లభనేని వంశీపై మరో కేసు

వల్లభనేని వంశీపై మరో కేసు

బెయిల్ ఇవ్వాల‌ని కోర్టుకు

అమ‌రావ‌తి – గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై మ‌రో కేసు న‌మోదు చేశారు పోలీసులు. గన్నవరం శివారులోని 18 ఎకరాల్లో ఉన్న పానకాల చెరువు భూమిని రైతులపై ఒత్తిడి చేసి వంశీ స్వాధీనం చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు బాధితుడు మర్లపాలెం గ్రామానికి చెందిన మురళి కృష్ణ. చెరువు అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించి మట్టి తవ్వకాలు చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్ప‌టికే త‌ను రిమాండ్ లో ఉన్నాడు.

ఇదిలా ఉండ‌గా వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గ‌తంలో త‌ను తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడు ఏరికోరి త‌న‌కు టికెట్ కూడా ఇచ్చాడు. వైపీపీలోకి జంప్ అయ్యాడు. అక్క‌డ ఉంటూ అన‌రాని మాట‌లు అన్నాడు.

చంద్ర‌బాబు, ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రితో పాటు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ బాబు గురించి నోరు జారాడు. ఆపై జ‌నం త‌ల దించుకునేలా మాట్లాడ‌ట‌మే కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చి పోయాడు. ఆపై భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపణ‌లు ఉన్నాయి. ఆ వెంట‌నే త‌న‌పై కేసులు న‌మోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments