ఆర్జీవీకి బిగ్ షాక్ మరో కేసు నమోదు
కోలుకోలేని రీతిలో దెబ్బ కొడుతున్న సర్కార్
అమరావతి – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఇప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు ఆర్జీవీ వాట్సాప్ నెంబర్ కు నోటీసు పంపించామని తెలిపారు సీఐ శ్రీకాంత్. ఈనెల 25న విచారణకు రావాల్సిందేగా పేర్కొన్నారు.
అయితే తనకు వారం రోజుల పాటు అవకాశం ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. ఇందులో భాగంగా అనకాపల్లిలో రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు చేశారు రావికమతం పోలీసులు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో రామ్ గోపాల్ వర్మ రెచ్చి పోయారు. ప్రధానంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వ్యూహం సినిమాలో వారి పాత్రలను మరింత దారుణంగా చిత్రీకరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ రావడంతో రామ్ గోపాల్ వర్మపై కేసుల పరంపర కొనసాగుతోంది.