తెలంగాణ ఆత్మ గౌరవం కేసీఆర్ చిత్రం
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ రాకింగ్ రాకేశ్ సారథ్యంలో ఎంతో కష్టపడి తీసిన కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) సినిమాపై స్పందించారు . ఈ సందర్బంగా రేయింబవళ్లు కష్టపడి, తెలంగాణపై ఎంతో ప్రేమతో తీసిన కేసీఆర్ చిత్రాన్ని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకం చూసి మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ అంటేనే మధురం, మాతృత్వం..నిలువెత్తు మాగాణం. అలాంటి మాతృభూమి తెలంగాణ గొప్పతనం గురించి రాసిన ప్రజాకవి గోరేటి వెంకన్న గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
మధురమైన స్వరంతో పాడిన మను, కల్పనకు , అంతకు మించి గుండెలకు హత్తుకునేలా స్వర పరిచిన చరణ్ అర్జున్ కు అభినందనలు తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత.
తెలంగాణ మీద ప్రేమతో, ఈ నేల గొప్పతనం గురించి, ఈ మట్టి కోసం పోరాడిన వీరుల త్యాగాల గురించి సినిమా తీసిన ఓరుగల్లు బిడ్డ రాకింగ్ రాకేష్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. బాధ్యత కలిగిన తెలంగాణ వాదులంతా కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్ ) సినిమాను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.