NEWSTELANGANA

ద‌ళిత బంధు అడిగితే దాడి చేస్తారా..?

Share it with your family & friends

ఇదేమి రాజ్యం పోలీసులు దారుణం

హైద‌రాబాద్ – ద‌ళిత బంధు ఏమైంద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన పాపానికి త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి దిగ‌డ‌మే కాకుండా అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ బద్దంగానే అడిగార‌ని, అయినా ఇది త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని అనేందుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డ‌మే కాకుండా తిరిగి అడిగిన వాళ్ల‌పై దాడుల‌కు దిగ‌డం స‌బ‌బు కాద‌న్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌మ‌ది ఫ‌క్తు దళితుల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ, నేడు ఆ దళితులకు దైర్యం ఇచ్చి, దళిత బంధు ఇవ్వాలని ప్రజాస్వామ్య పద్ధతిలో అడగడం కూడా నేరమేనా అని ప్ర‌శ్నించారు.

ఒక వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతుంటే ఇంకో వైపు అదే రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నాడంటూ మండిప‌డ్డారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

పోలీసుల దాడిలో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.