NEWSTELANGANA

కేటీఆర్ కాన్వాయ్ పై దాడి దారుణం

Share it with your family & friends

ప్ర‌జాస్వామ్య‌మా లేక నియంతృత్వ‌మా

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బాధితుల ప‌క్షాన ప్ర‌శ్నించ‌డాన్ని జీర్ణించుకోలేక దాడుల‌కు దిగ‌డం దారుణ‌మ‌న్నారు. మంగ‌ళ‌వారం త‌మ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్యాయ్ ను అడ్డుకోవ‌డం, ఆపై దాడికి దిగ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇది ప్ర‌జాస్వామ్య‌మా లేక నియంతృత్వ‌మా అని నిల‌దీశారు. గూడు చెదిరి, గుండె పగిలి రోదిస్తున్న పేదలకు అండగా నిలిచి భరోసా ఇవ్వడానికి వెళ్తున్న త‌మ నాయ‌కుడిని అడ్డుకోవ‌డం పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు .

అధికారం ఉంది క‌దా అని రాచ‌రిక పాల‌న సాగిస్తామంటే, దాడుల‌కు దిగుతామంటే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు రాకేశ్ రెడ్డి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇప్ప‌టికే కూల్చివేత‌ల‌పై సీరియ‌స్ కామెంట్స్ హైకోర్టు చేసినా ఇంకా స‌ర్కార్ లో మార్పు రాక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు .

అధికారం ఎన్న‌టికీ, ఎప్ప‌టికీ శాశ్వ‌తం కాద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని సీఎం ఎ. రేవంత్ రెడ్డికి హిత‌వు ప‌లికారు. మీరు తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ప్ర‌తి ఒక్క‌రు కేటీఆర్ కాన్యాయ్ పై జ‌రిగిన దాడిని ఖండించాల‌ని పిలుపునిచ్చారు.