NEWSTELANGANA

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో పాల‌న దారుణంగా త‌యారైంద‌ని పేర్కొన్నారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం వాటిల్లుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త రాజ్యాంగం గురించి, వాక్ స్వాతంత్రం గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్నాడ‌ని కానీ అదే పార్టీకి చెందిన ప్ర‌భుత్వం తెలంగాణాలో తూట్లు పొడిచే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఏనుగుల రాకేశ్ రెడ్డి హిత‌వు ప‌లికారు.

త‌మ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా వాలంటీర్ల‌ను ప‌నిగ‌ట్టుకుని అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు . కార‌ణం లేకుండా , ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా ఎలా అదుపులోకి తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

విచిత్రం ఏమిటంటే ద‌స‌రా సెల‌వుల స‌మ‌యంలో పండుగ చేసుకోనీయ‌కుండా త‌మ బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వాలంటీర్ల‌ను అక్ర‌మంగా అరెస్ట్ వేధించేందుకు ప్లాన్ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

సోష‌ల్ మీడియా వాలంటీర్లు ఎవ‌రూ భ‌య ప‌డ‌వ‌ద్ద‌ని , ఆందోళ‌న‌కు గురి కావ‌ద్ద‌ని కోరారు . ఇందు కోసం పార్టీ ప‌రంగా న్యాయ స‌ల‌హాలు ఇచ్చేందుకు సిద్దంగా న్యాయ‌వాదులు సిద్దంగా ఉన్నార‌ని సూచించారు.