గ్రూప్ 1 అభ్యర్థులపై దాడులు దారుణం
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయ పరమైన డిమాండ్ సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రూప్ 1 ఆశావహులు, అభ్యర్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాష, దాడులకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా సీరియస్ అయ్యారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి దాడులు చేయడమే మొహబ్బత్ కా దుకాణ్ అని అన్నారు. ఓ వైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రచారం చేస్తున్న పార్టీ నేతకు తెలంగాణలో చోటు చేసుకున్న వాస్తవ పరిస్థితులు అర్థం కాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు .
రాష్ట్రంలో పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగుతోందని ఆరోపించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. జివో 26 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వారి పట్ల ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని నిలదీశారు.
స్టడీ హాళ్లు, లైబ్రరీల్లోకి వెళ్లి విద్యార్థులను, నిరుద్యోగులను కొట్టారని , ఈ అధికారం మీకు ఎవరిచ్చారని ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో రెండు వేర్వేరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇక్కడ పూర్తిగా ఏకపక్ష పాలన సాగుతోందని ఆరోపించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.