బతుకమ్మకు వందనం ఆడబిడ్డలకు అభివందనం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
వరంగల్ జిల్లా – తెలంగాణ అంటేనే కల్మశం లేని మనుషుల అనుబంధం. నాలుగున్నర కోట్ల మట్టి బిడ్డల ఆనందమే ఈ బతుకమ్మ ఉత్సవం. ఆడ బిడ్డలు చేసుకునే ఈ బతుకమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి.
తెలంగాణ అంతటా పూల వనమై పోయింది. బతుకమ్మ ఆట పాటలతో అలరారుతోందని అన్నారు. ఇది ఆడ బిడ్డల ఆనందపు వేడుక. మట్టి బిడ్డల ఆత్మీయతకు ఆలవాలంగా మారిన వేదిక అని పేర్కొన్నారు.
తీరొక్క పువ్వులు తెచ్చి అందమైన బతుకమ్మ ను పేర్చినట్టే సమాజంలో కుల మత, వర్ణ వర్గ బేధాలు లేకుండా అందరూ కలిసి మెలసి జీవిస్తే అందమైన బతుకమ్మలా సమాజం ఉంటుందని అన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇదే మనందరికీ బతుకమ్మ ఇచ్చే సందేశమని స్పష్టం చేశారు.
కుల, మతాలకు అతీతంగా సాగే ఈ అద్భుత సాంస్కృతిక సన్నివేశం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. ఒక్క తెలంగాణ మాగాణంలోనే కొనసాగుతుందని పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత. తెలంగాణ లోని అక్కా చెల్లెళ్లకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియ చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.