NEWSTELANGANA

విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదా..?

Share it with your family & friends

బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థులు పాఠశాలలో కంటే ఆసుపత్రులలోనే ఎక్కువగా ఉంటున్నారని సీరియ‌స్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిల్ల‌ల విష‌యంలో చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ అరెస్టులపై ఎప్పటికప్పుడు గొంతు చించుకున్న సీఎం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎందుకు అక్ర‌మ కేసులు, అరెస్ట్ లు, నిర్బంధాల‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

గురుకులాలు పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయ‌ని, ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్షంగా తాము ప్ర‌శ్నిస్తున్నామ‌ని దీనికి ఉలికిప‌డితే ఎలా అని అన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కీల‌క‌మైన శాఖ‌ల‌న్నీ సీఎం వ‌ద్దే ఉంచుకున్నార‌ని , కేవ‌లం మాట‌ల‌తో కాల‌యాప‌న చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

ఓ వైపు రాష్ట్రంలో పిల్ల‌లు ఆస్ప‌త్రుల పాలై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని మ‌రో వైపు విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజసం అంటూ మండిప‌డ్డారు. ఒక‌ప్పుడు గురుకులాల‌లో సీట్ల కోసం ఎగ‌బ‌డిన త‌ల్లిదండ్రులు ఇప్పుడు పంపించాలంటే జంకుతున్నార‌ని ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం ఒక‌సారి ఆలోచించాల‌ని సూచించారు.