అమృత్ స్కామ్ పై విచారణ చేపట్టాలి
బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అమృత్ స్కీమ్ స్కామ్ పై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం ఎ. రేవంత్ రెడ్డి బావ మరిది పేరుతో లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ముఖ్యమంత్రి బావ మరిది సృజన్ రెడ్డికి చెందిన శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమా కాదా అని నిలదీశారు అనుగుల రాకేశ్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారం బీఆర్ఎస్ బయట పెట్టిందని తెలిపారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట వాస్తవమా కాదా అని నిలదీశారు అనుగుల రాకేశ్ రెడ్డి.
శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని, కానీ దానికి ఎలా టెండర్ ను ఖరారు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేసింది చాలక తిరిగి లీగల్ నోటీసులు పంపించడం దారుణమన్నారు. అయినా నీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు అనుగుల రాకేశ్ రెడ్డి.