జాబ్స్ లేని క్యాలెండర్ ఎందుకు..?
నిప్పులు చెరిగిన రాకేశ్ రెడ్డి అనుగుల
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ నేత అనుగుల రాకేశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై మండిపడ్డారు. ఇందులో జాబ్స్ గురించిన పూర్తి సమాచారం లేదని పేర్కొన్నారు.
ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ , నిర్వహించే తేదీలు, ఫలితాలు వెల్లడించే డేట్స్ ను పొందు పరుస్తారని తెలిపారు. కానీ ఇవేవీ లేవని, కేవలం చిత్తు కాగితం లాగా మారిందని మండిపడ్డారు అనుగుల రాకేశ్ రెడ్డి.
ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు . ఎన్నికల ప్రచారంలో 2 లక్షల జాబ్స్ ను ఏడాదిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని కానీ ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా నింప లేదని ఆరోపించారు.
ఇది ఉద్యోగాల క్యాలెండర్ కాదని ఉత్తుత్తి , జారుకునే క్యాలెండర్ అంటూ ఎద్దేవా చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి. మైసూర్ బజ్జీలో బజ్జీ అయినా ఉంటుంది, బొంబాయి రవ్వలో రవ్వ అయినా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఇటు జాబ్స్ లేవు అటూ క్యాలెండర్ లేదన్నారు బీఆర్ఎస్ నేత.