NEWSTELANGANA

క‌క్ష సాధింపుల కోస‌మే ‘హైడ్రా’మా

Share it with your family & friends

అనుగుల రాకేశ్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కేవ‌లం ప్ర‌తిపక్షాల‌ను టార్గెట్ చేసేందుకే కాంగ్రెస్ ప్ర‌భుత్వం హైడ్రాను తీసుకు వ‌చ్చింద‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చాల్సిందేన‌ని , దాని విష‌యంలో తాము అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌న్నారు. కానీ HMDA, నీటి పారుదల శాఖ, జిల్లా కలెక్టర్ నుండి NOC పొంది అన్ని అనుమతులు పొందిన మెడికల్ కాలేజీ ని, ఆసుపత్రి ని ఎలా కూలుస్తారంటూ ప్ర‌శ్నించారు అనుగుల రాకేశ్ రెడ్డి.

ఇక అలాంట‌ప్పుడు ఈ అనుమ‌తులు ఎందుక‌ని నిల‌దీశారు రాష్ట్ర స‌ర్కార్ ను. అనుమతులు ఇచ్చిన అధికారుల పై కేసులు పెట్టారా? చట్టం అధికారులకు వర్తించదా అని నిప్పులు చెరిగారు. మీకు నచ్చక పోతే ఎన్ని అనుమతులు ఉన్నా, ఎన్ని NOC లు ఉన్నా ఆస్తులను ధ్వంసం చేస్తారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో ఏ కాలేజీ సీట్లను తగ్గించకుండా అంత మంచి విద్యను అందిస్తున్న అనురాగ్ సంస్థల 480 సీట్లను ఎందుకు తగ్గించారని ప్ర‌శ్నించారు అనుగుల రాకేశ్ రెడ్డి. కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే హైడ్రాను ప్ర‌యోగిస్తున్నారంటూ ఆరోపించారు.