బాధితులకు న్యాయం చేస్తాం – అనుర
ఈస్టర్ చర్చి దాడి బాధితులతో భేటీ
శ్రీలంక – శ్రీలంక నూతన దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలనా పరంగా కీలక మార్పులు తీసుకు వచ్చారు. తాను అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధానమంత్రిగా సమాజంతో సంబంధం కలిగి ఉన్న మేధావి అయిన డాక్టర్ హరిణిని నియమించారు. దేశ ఆర్మీలో కూడా కీలక పదవులలో సమర్థులను నియమించే ప్రయత్నం చేశారు అనుర కుమార దిస్సనాయకే.
అన్ని వర్గాలను కలుపుకుని పోయేలా తనను తాను మార్చుకుంటున్నారు శ్రీలంక నూతన అధ్యక్షుడు. ఇదిలా ఉండగా ఆదివారం అందరినీ విస్మయానికి గురి చేశారు అనుర కుమార దిస్సనాయకే.
2019లో ఈస్టర్ ఆదివారం దాడి జరిగిన కటువాపిటియలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిని సందర్శించారు. అలాంటి విషాదం మళ్లీ జరగకూడదని అన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే. బాధితులకు న్యాయం జరిగేలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఆరు నూరైనా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు అనుర కుమార దిస్సనాయకే.