చిన్నారులు..యువత భవిష్యత్తు ముఖ్యం
శ్రీలంక అధ్యక్షుడు అనుర దిస్సనాయకే
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు చిన్నారులు, యువతీ యువకుల భవిష్యత్తు అనేది అత్యంత ముఖ్యమని అభిప్రాయ పడ్డారు. తాను అధ్యక్షుడిగా కొలువు తీరిన వెంటనే ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధిపై ఎక్కువ దృష్టి సారించామని స్పష్టం చేశారు అనుర కుమార దిస్సనాయకే.
ప్రధానంగా జ్ఞానం, నైపుణ్యాలు, విద్య, వ్యవస్థాపకతను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సోమవారం దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే మీడియాతో మాట్లాడారు.
పిల్లలు, యువతకు మెరుగైన రీతిలో భవిష్యత్తు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరి నుంచి సలహాలు , సూచనలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు మరిన్నింటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అంతే కాకుండా వసతి సౌకర్యాలు విస్తృతంగా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కీలకమైన శాఖలు తన పరిధిలో ఉన్నాయని, ప్రధానమంత్రి డాక్టర్ హరిణితో కలిసి చర్చించడం జరిగిందన్నారు.