స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు
దావోస్ – ఏపీలో విద్యుత్ ఉత్పాదనకు మంచి అవకాశాలున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సుదీర్ఘమైన తీరప్రాంతం, రవాణాకు అందుబాటులో పోర్టులు ఉన్నాయని. ఈవీ వాహనాలు ఉత్పత్తి చేసేందుకు ఏపీ ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. పీఎం సూర్యఘర్ కింద ఇంటింటికీ సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామని ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ కానుందన్నారు.
ఓవైపు పర్యావరణాన్ని సంరక్షిస్తూనే ఈ విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాల్సి ఉందన్నారు. మంగళవారం దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు.
ఇంధన వనరుల్లో సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు సీఎం. అలాగే పంప్డ్ స్టోరేజీ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపైనా ఏపీలో ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందన్నారు. 115 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని తెలిపారు.
500 మెగావాట్ల , 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని పేర్కొన్నారు. 21 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎన్టీపీసీ-ఏపీ జెన్ కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాయని ప్రకటించారు.. ఏపీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారబోతోందని స్పష్టం చేశారు.