17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నాలుగు రోజుల పాటు నడిచే ఛాన్స్
అమరావతి – రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకున్న తర్వాత శాసన సభలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో తాజాగా శాసన సభతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక కూటమిలో భాగస్వామ్య పక్షాలైన జనసేన పార్టీ 21 స్థానాలను గెలుచుకుంది. ఇక 8 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఆయా పార్టీలకు సంబంధించి శాసన సభా పక్ష నేతలను కూడా ఎన్నుకోనున్నారు.
కాగా ఈనెల 12న బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 17 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు సమాచారం.