ప్రకటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
అమరావతి – ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 3 వారాలకు పైగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశాల నిర్వహణపై సమీక్ష చేపట్టారు. అర్థవంతమైన చర్చలు జరిగేలా సభ్యులు సహకరించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈనెల 6న కేబినెట్ మీటింగ్ చేపట్టాలని నిర్ణయించారు. పని దినాలు, బడ్జెట్ తేదీలు ఖరారు చేయనున్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు, రాష్ట్రానికి ఇంకా రావాల్సిన నిధులు, ఆయా శాఖలకు కేటాయించాల్సిన నిధులు, ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి,నిర్మాణం పనులు, తదితర అంశాలపై చంద్రబాబు రివ్యూ చేయనున్నారు.
ఇప్పటికే ఆయన మంత్రుల పనితీరుపై ఒకింత గుర్రుగా ఉన్నారు. ఎవరికి వారు తమ తమ శాఖలపై పట్టు పెంచుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు. కొందరి పనితీరు మాత్రమే బాగుందని, మిగతా వారు మరింత మెరుగు పర్చుకోవాలని సూచించారు.