21 నుంచి బీజేపీ ప్రజా పోరు
దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్
అమరావతి – ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు యాత్రలకు శ్రీకారం చుట్టాయి. నువ్వా నేనా అన్న రీతిలో పరిస్థితి నెలకొంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పొత్తుల విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించింది. మరో వైపు టీడీపీ కూడా ఈసారి జత కట్టనుంది. దీంతో మొత్తంగా రాష్ట్రంలో ఐదు పార్టీలు పోటీకి దిగనున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఈనెల 21 నుంచి 29వ వరకు ప్రజా పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.
రాష్ట్రంలో వైసీపీ పాలనపై యుద్దం చేసేందుకు, ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగంగానే తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈసారి తమ కూటమి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
ప్రతి ఒక్కరు ప్రజా పోరులో పాల్గొనాలని, అవినీతి, అక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ చీఫ్. తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.