బీసీల పేరుతో టీడీపీ మోసం – బీఎస్పీ
రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచందర్ రావు ఫైర్
అమరావతి – బీసీల పేరుతో తెలుగుదేశం పార్టీ మోసం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు. బీసీల జపం చేస్తూ పదవులు అనుభవిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక మీరు చేస్తున్న మోసాలు , ఆటలు ఇక సాగవంటూ హెచ్చరించారు. బడ్జెట్ లో బీసీలకు డబ్బులు కేటాయించామంటూ అబద్దాలు చెప్పారని ఆరోపించారు. స్కిల్ సెన్సస్ అంటూ పక్కదారి పట్టించడం టీడీపీ కూటమి సర్కార్ కు చెల్లిందన్నారు.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బీసీల పేరును వాడుకుంటోందని ధ్వజమెత్తారు పూర్ణ చందర్ రావు. బహుజనులు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. జనాభా దామాషాలో బీసీలకు టీడీపీ చేసింది ఏమీ లేదన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా బీసీల ఓటు బ్యాంకు ఉండడంతో వారిని ఏదో రకంగా మభ్య పెట్టి అధికారంలోకి రావడం పనిగా పెట్టుకుందని టీడీపీపై ధ్వజమెత్తారు పూర్ణ చందర్ రావు. ఓట్లు మాత్రం బీసీలవి కావాలి..కానీ సీట్లు మాత్రం ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతామని ప్రకటించారు బీఎస్పీ కోఆర్డినేటర్