రూ. 3.46 లక్షల కోట్ల అంచనా
అమరావతి – ఏపీ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి నూతన బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతిని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అందజేశారు. ఈ కీలక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు.
ఈ సందర్బంగా పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి అప్పులు తప్ప ఏమీ మిగల్చ లేదన్నారు. అందుకే తమ కూటమి సర్కార్ కు ఏపీ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు.
శ్వేత పత్రాల ద్వారా ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేశామన్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించ లేదన్నారు. సామాన్యుల సంతోషమే.. రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పారన్నారు.