ఏపీ క్యాబ్ డ్రైవర్లను వద్దంటే ఎలా..?
తెలంగాణ డ్రైవర్లు సహకరించాలన్న పవన్
హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డ్రైవర్లు మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం మంచి పద్దతి కాదన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లేందుకు హక్కు ఉందన్నారు. ఆ విషయం తెలుసుకుని కలిసి పని చేసుకుంటే బావుంటుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
తమను ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన డ్రైవర్లు అంటున్నారని, తమను ఎలాగైనా కాపాడాలని ఏపీకి చెందిన హైదరాబాద్ లో ఉంటున్న క్యాబ్ డ్రైవర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వేడుకున్నారు. ఈ సందర్బంగా వినతి పత్రం సమర్పించారు.
క్యాబ్ డ్రైవర్లకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. తాను తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతానని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, సఖ్యతతో కలిసి మెలిసి పని చేసుకోవాలని సూచించారు.