ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం
రూ. 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
అమరావతి – ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కోరిక మేరకు డ్రోన్ టెక్నాలజీపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని తీర్మానం చేసింది. ఈ విషయాన్ని బుధవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
ఇవాళ సచివాలయంలో ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించారు. కొన్నింటికి ఆమోదం తెలిపారు. ఈనెల 11న శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా కొలుసు పార్థసారథి కీలక విషయం వెల్లడించారు.
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీని రూపొందించడం జరిగిందన్నారు.. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన అన్నది టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు.
డ్రోన్ రంగంలో రూ.3 వేల కోట్ల రాబడి రావాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్ కావాలన్నారు. డ్రోన్ హబ్ గా ఓర్వకల్లు ఉంటుందన్నారు. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యా సంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం ఇస్తామన్నారు.