Thursday, April 17, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీ కేబినెట్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు

ఆమోదించిన మంత్రివ‌ర్గం

అమ‌రావ‌తి – ఏపీ మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన‌ మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు..

డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్‌. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఓకే చెప్పింది. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది.. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది

ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించను్నాయి. 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం లభించింది..

12,065 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. ఆగ్వా గ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ 1000 మెగా వాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments