సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ కీలక సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపి డ్రోన్ కార్పొరేషనను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం లభించింది. త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం.
బార్ లైసెన్స్ ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ తీర్మానం చేసింది. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం లభించింది. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదం కూడా తెలిపింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదించింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పనకు కూడా ఓకే చెప్పింది.