వెల్లడించిన మంత్రి అనిత వంగలపూడి
అమరావతి – షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు మంత్రి మండలి ఆమోదించిందని తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. సమాన, స్వేచ్ఛ హక్కులు, అవకాశాలను కల్పించమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రెల్లి కులస్థులకు కూడా 1శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. అన్ని ఉపకులాలకు సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామన్నారు. తిరుపతి అనేది పవిత్ర స్థలం..సున్నితమైన అంశమని, దానిని రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ఘర్షణలు, శాంతి భద్రతలను దెబ్బ తీయాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు.
టీటీడీపై బురదజల్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని యత్నించారని ఆరోపించారు. గతంలో పింక్ డైమండ్‌పైనా ఇలాగే దుష్ప్రచారం చేశారని ఆవేదన చెందారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపైనా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సిట్ విచారణ పూర్తి చేస్తామని, బాధ్యులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లేదన్నా పింక్ డైమండ్‌పై విష ప్రచారం మానుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీటీడీ గోశాలపై ఈవో శ్యామలారావు నిజాలు వెల్లడించారని చెప్పారు.