NEWSANDHRA PRADESH

ఏపీ కేబినెట్ కీల‌క స‌మావేశం

Share it with your family & friends

పాల్గొన్న సీఎం ..డిప్యూటీ సీఎం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సార‌థ్యంలోని మంత్రివ‌ర్గం కీల‌క స‌మావేశం జ‌రిగింది. స‌చివాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో బాబుతో పాటు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌, మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, ప‌ల్లా శ్రీ‌నివాస రావు, అచ్చెన్నాయుడు, వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య కుమార్ యాద‌వ్ , గొట్టిపాటి ర‌వి కుమార్ , ఆనం రామ నారాయ‌ణ రెడ్డితో పాటు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా తాజాగా అసెంబ్లీలో చ‌ర్చించిన అంశాల గురించి చ‌ర్చించారు. ఇంకా ఏయే శాఖ‌ల‌కు ఎన్నెన్ని కోట్లు ఎలా కేటాయింపులు జ‌ర‌పాల‌నే దానిపై కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన మంత్రులు మ‌రింత త‌మ శాఖ‌ల ప‌ట్ల ప‌ట్టు పెంచుకోవాల‌ని సూచించారు.

ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌పై దృష్టి సారించాల‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతృప్తితో ఉన్నార‌ని, ఈ సంద‌ర్బంగా మ‌రింత ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేయాల‌ని సూచించారు.