రేపే ఏపీ కేబినెట్ సమావేశం
వెల్లడించిన సీఎస్ నీరబ్ కుమార్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈనెల 24న సోమవారం జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు సీఎస్. ఆరోజు ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాకు లోని మంత్రి మండలి సమావేశపు హాలులో ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశం నూతన సీఎంగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుందని నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.
రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి సంబంధించి అజెండా అంశాలతో కూడిన సమాచారాన్ని తనకు సమర్పించాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.