Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESH7న ఏపీ కేబినెట్ స‌మావేశం

7న ఏపీ కేబినెట్ స‌మావేశం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ఏపీ కేబినెట్ స‌మావేశం ఈనెల 7న జ‌ర‌గ‌నుంది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగే మీటింగ్ లో కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు, ప్రాజెక్టుల అమలు, సంక్షేమ పథకాలపై చర్చించ‌నున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండ‌గా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి 5లోగా పంపించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంర‌ద్బంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌త్యేకించి ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో పాటు ఆయా శాఖ‌లకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు సైతం పూర్తి వివ‌రాల‌తో రావాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొంత మంది మాత్ర‌మే త‌మ శాఖ‌ల‌పై ప‌ట్టు క‌లిగి ఉన్నార‌ని మిగ‌తా వారి ప‌రిస్థితిలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ మేర‌కు ర్యాంకుల‌ను కూడా ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. విచిత్రం ఏమిటంటే 5వ స్థానంలో నిలిచారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments