మార్చేసిన ఏపీ కూటమి సర్కార్
అమరావతి – ఏపీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తున్నట్లు వెల్లడించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ లో కూడా ఇందుకు సంబంధించి వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. ఇక నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా గతంలో ఏపీలో ఉన్న జగన్ రెడ్డి సర్కార్ కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టింది.
కాగా ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఓకే చెప్పింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ నిర్ణయించింది. సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.