NEWSANDHRA PRADESH

ఏపీలో 4.14 కోట్ల మంది ఓట‌ర్లు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఈవో ముఖేష్ మీనా
అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముకేష్ కుమార్ మీనా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నార‌ని చెప్పారు.

ఇందులో 65, 797 మంది స‌ర్వీస్ ఓట‌ర్లు ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో క‌నీసం 1500 మంది ఓట‌ర్ల‌కు ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఒక‌వేళ 1500కు పైగా ఓట‌ర్లు పెరిగితే ఆక్సిర‌రీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు ముకేష్ కుమార్ మీనా.

ఇదిలా ఉండ‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌త్తం 224 ఆక్సిల‌రీ (ప్ర‌త్యామ్నాయ‌) పోలింగ్ కేంద్రాల కోసం ప్ర‌తిపాద‌న‌లు పంపించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు సీఈవో. ఇక రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు .

ఇప్ప‌టి వ‌ర‌కు ఆయా పార్టీల‌కు చెందిన నేత‌ల‌పై 864 కేసులు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు ముకేష్ కుమార్ మీనా.