ఏపీ అల్లర్లపై సిట్ నియామకం
స్పష్టం చేసిన ఎన్నికల అధికారి
అమరావతి – ఏపీలో చోటు చేసుకుంటున్న అల్లర్లు, సంఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఇప్పటికే సీరియస్ అయ్యింది . ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ గుప్తాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆ ఇద్దరూ వ్యక్తిగతంగా సీఈసీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో పోలింగ్ ముగిసినా ఇంకా ఏపీలో పలు చోట్ల ఇరు వర్గాలు దాడులకు దిగడం పట్ల మండిపడింది. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియమించారు.
ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 18 లోగా నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చోటు చేసుకున్న ప్రతి ఘటనపై నివేదిక ఇవ్వనుంది సిట్.
ఈ నివేదిక ఆధారంగా హింసాత్మక సంఘటనలకు బాధ్యులైన వారిపై ఈసీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది.