NEWSANDHRA PRADESH

ప్ర‌తి టేబుల్ వద్ద ఒక ఏజెంట్

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఇఓ మీనా

అమ‌రావ‌తి – ఏపీలో శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జూన్ 4న మంగ‌ళ‌వారం లెక్కించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసింది. ఆయా పార్టీల‌కు సంబంధించి కీల‌క సూచ‌న‌లు కూడా అంద‌జేసింది. ఎలాంటి చిన్న అనుమానం వ‌చ్చినా వాటిని ఆయా పోలింగ్ కేంద్రాల బాధ్యుల‌కు వెంట‌నే తెలియ చేయాల‌ని సూచించారు ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.

సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ ను నియమించుకునే అవకాశం అభ్యర్థికి కల్పించాలని కలెక్టర్లను ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.

ఆర్ ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడే ఏజెంటుకు అవకాశం కల్పించాలని స్ప‌ష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫాం-17సీ, పెన్ను,పెన్సిల్, పేపర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

కౌంటింగ్ సెంటర్లోకి సెల్ ఫోన్ లు కలిగిన మీడియా ప్రతినిధులను అనుమతించ వ‌ద్ద‌ని ఆదేశించారు సీఇఓ మీనా.