NEWSANDHRA PRADESH

ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల‌పై ఆరా

Share it with your family & friends

జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు

అమ‌రావ‌తి – ఏపీలో శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ ముగిసింది. ఇక ఎవ‌రు విజేత‌లు ఎవ‌ర‌నేది తేల‌నుంది జూన్ 4వ తేదీ మంగ‌ళ‌వారం. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ఏర్పాట్లు చేసింది. గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

ఎన్నిక‌ల పోలింగ్ కు సంబంధించి ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు , ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు.

ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్, ఈ టి పి బి ఎస్ , పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపుకు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారిగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు పై ఆరా తీశారు.

ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానం పై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం , మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు సీఈవో మీనా.