తెనాలి ఎమ్మెల్యేపై ఈసీ సీరియస్
గృహ నిర్భంధంలో ఉంచాలని ఆదేశం
అమరావతి – అధికారం పార్టీకి చెందిన గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ శాసన సభ్యుడు శివకుమార్ పై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతే కాకుండా ఎక్కడికీ వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని స్పష్టం చేసింది. ఏ మాత్రం బయటకు వచ్చినా డీజీపీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో బాధ్యత కలిగిన ఓ ఎమ్మెల్యే ఇలా బరి తెగించి ఓటర్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. దీనిని సీరియస్ గా తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఎన్నికలను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం పోలింగ్ సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే నేరుగా ఓటు వేసేందుకు వెళ్లారు. దీనిపై అభ్యంతరం తెలిపారు ఓటర్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగాడు. చెంపపై కొట్టడంతో సదరు ఓటర్ ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించారు.