NEWSANDHRA PRADESH

ఏపీ సీఈవో షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

ముకేష్ కుమార్ మీనా స్పంద‌న

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ముఖేష్ కుమార్ మీనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో ఎవ‌రైనా రాజ్యాంగం కంటే ఎక్కువ కాద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజాగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డికి సంబంధించిన వ్య‌వ‌హారంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఈవో.

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనమ‌ని చెప్పారు ముకేష్ కుమార్ మీనా.. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఒక గుణపాఠం కావాల‌ని అన్నారు.

ఈవీఎం ద్వంసానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఈ ఘటనకు సరైన ముగింపు లభించిందన్నారు. ఇక‌నైనా ప్ర‌జా ప్ర‌తినిధులు ఎవ‌రైనా ఈవీఎంల‌తో పెట్టుకుంటే జైలు కూడు తిన‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.